కేసీఆర్‌కు గుడ్ న్యూస్ చెప్పిన జ్యోతిష్యుడు.. ఈసారి ఏ పదవి చేపట్టబోతున్నారో తెలుసా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షపార్టీలు, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలు మొదలుపెట్టాయి. దీంతో ఈసారి ప్రజలు రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారో అని అందరూ ఆసక్తిగా

Update: 2023-05-29 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షపార్టీలు, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలు మొదలుపెట్టాయి. దీంతో ఈసారి ప్రజలు రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో మూడోసారి ముచ్చటగా కేసీఆర్‌నే అధికారంలోకి రాబోతున్నాడంటూ జోస్యంచెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలంగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు.

ఇక రుద్ర కరణ్ పర్తాప్ జోస్యానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే కచ్చితమైన అంచనాను చెప్పారు. ఆయన అంచనాలే నిజమయ్యాయి. దీంతో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన చేసిన జోస్యానికి ప్రాధాన్యత సంతరించుకుంది. నమో రుద్రాయా.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వమే మళ్లీ అధికారాన్ని చేపడుతుంది. ఆ ప్రభుత్వమే తెలంగాణను పాలిస్తుంది’ అని రుద్ర కరణ్ పర్తాప్ మే 27వ తేదీన సాయంత్రం 7.38 గంటలకు ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.


Tags:    

Similar News

టైగర్స్ @ 42..