మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అలా చేయడమే లక్ష్యం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పారదర్శకతతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం, క్లీన్ ఎనర్జీని పెంపొందించడమే లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-20 08:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారదర్శకతతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం, క్లీన్ ఎనర్జీని పెంపొందించడమే లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బేగంపేటలోని వివంతా హోటల్‌లో జరిగిన మినరల్ ఎక్స్ ప్లోరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్డు షోలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గనుల ఎక్స్‌ప్లోరేషన్‌కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భం అన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకంలో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్ సంబంధిత వర్గాల సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం నూతన ఆవిష్కరణలతో వైవిధ్యంగా ముందుకు వెళ్తోందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం, చొరవ‌తో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు.. స్వయం సమృద్ధిని పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

భారత దేశాన్ని ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం బీజేపీ సర్కార్ టార్గెట్ అన్నారు. ఈ సాధనలో మైనింగ్ సెక్టార్ ముఖ్యమైన పాత్ర పోషించునుందని తెలిపారు. మైనింగ్ సెక్టార్ భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. బలమైన మైనింగ్, మినరల్స్ సెక్టార్ లేకుండా స్వయం సమృద్ధి సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారని గుర్తు చేశారు. ఈ రెండూ మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు అన్నారు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. దాంతో పాటే మినరల్స్‌కు డిమాండ్ పెరుగుతున్నదన్నారు. అందుకే ఆధునిక టెక్నాలజీతో ఖనిజ సంపదను అన్వేషించాల్సిన సమయం ఇదని అన్నారు. దీని కోసం జీఎస్ఐ ద్వారా ఎక్స్‌టెన్సివ్ జియోలాజికల్ డేటాను రూపొందించాం అన్నారు.

ఈ సందర్బంగా నేషనల్ డీఎంఎఫ్ పోర్టల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఖనిజ క్షేత్రంలో స్వయం సమృద్ధి సాధించడానికి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. మనమంతా సంఘటితంగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని తాను కోరుకుంటున్నాన అని తెలిపారు. మనందరం కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్ కలను నిజం చేయడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ సిన్హా, బీహార్ ఉపముఖ్యమంత్రి వీణ కుమారి, జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ జనార్ధన్ ప్రసాద్, డైరెక్టర్ జనరల్ జిహలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుశీల్ కుమార్, DGM తెలంగాణ తదితరులు పాల్గొన్నారు.


Similar News