అదే ఆయన బాధ.. KTRపై మంత్రి సీతక్క సెటైర్లు
తమ చేతిలో నుంచి పవర్ పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ బాధపడుతున్నాడని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తమ చేతిలో నుంచి పవర్ పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ బాధపడుతున్నాడని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. తాము పవర్లోకి వచ్చి వారం రోజులు పూర్తి కాకముందే కేటీఆర్ విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. కేటీఆర్, బీఆర్ ఎస్‌కు ఎలాంటి టెన్షన్ అవసరం లేదన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తామన్నారు.
ప్రతిపక్షాలు ఓపిక పట్టాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి ప్లాన్, చిత్తశుద్ధి ఉన్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ రెండు దఫాల అధికారంలో అనేక తప్పిదాలు చేసిందని, ప్రతి అంశంపై విచారణ జరుగుతుందన్నారు. లెక్కలన్నీ బయటకు తీస్తామన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం మాత్రమే వినియోగిస్తామన్నారు. ఇక రైతు బంధుపై సమయం లేకపోవడంతో పాత పద్ధతినే అమలు చేస్తున్నామన్నారు. త్వరలో కొత్త విధానాన్ని తీసుకువస్తామన్నారు.