సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌కు ధన్యవాదాలు: స్పీకర్ గడ్డం ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ధన్యవాదాలు(thank you) తెలిపారు. టీటీడీ చైర్మన్ (TTD Chairman)గా ఎన్నికైన తర్వాత.. బీఆర్ నాయుడు(BR Naidu) .. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లి.. అక్కడ స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల(Telangana public representatives) లేఖల సిపార్సులను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ బీఆర్ నాయుడుని కారగా.. తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు. ఈ క్రమంలో.. టీటీడీ పాలక మండలి(TTD Governing Council)లో చర్చించిన అనంతరం.. తిరుమలలో వారానికి రెండు రోజుల పాటు.. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
అనంతరం ఈ రోజు తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల సీఫార్సుకు సంబంధించిన ఫైలుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) సంతకం చేశాడు. దీంతో కొత్త సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై వారానికి నాలుగు సార్లు దర్శనానికి అనుమతి లభించనుంది. ఇందులో రెండు రోజులు బ్రేక్ దర్శనాలు, మరో రెండు రోజులు రూ. 300 దర్శనాలకు అనుమతించనున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం(AP Govt) తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఇలా రాసుకొచ్చారు.
తిరుమల(Tirumala)లో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖ(Recommendation Letters)లను అంగీకరించాలని కొద్ది రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకి వినతిపత్రం అందించడం జరిగింది. సిఫార్సు లేఖల అంగీకారానికి ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, టిటిడి చైర్మన్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల తరుపున నా ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం, వసతి మరింత సులభమవుతుందని అభిప్రాయాన్ని స్పీకర్ వ్యక్తం చేశారు.