నా వ్యాఖ్యలను థాక్రే లైట్ తీసుకున్నారు: కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ ముగిసింది.

Update: 2023-02-15 06:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తాను నిన్న పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి స్పందించారు. బుధవారం ఉదయం రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రేతో సమావేశం అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొత్తులపై నేను నిన్న మాట్లాడిన వ్యాఖ్యలను థాక్రే లైట్ తీసుకున్నారని అన్నారు.

మా పార్టీ నేతలు కూడా నా వీడియో పూర్తిగా చూడకుండానే మాట్లాడుతున్నారని అన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని చెప్పానని గతంలో టీడీపీతో పొత్తు మాకు నష్టం చేసిందన్నారు. ఈ సారి నష్టం జరగకుండా ఉండాలంటే గెలిచేవారికే టికెట్లు ముందుగా ఇవ్వాలని థాక్రేతో చెప్పాన్నారు. పొత్తులపై నేను మాట్లాడిన వ్యాఖ్యలను థాక్రే లైట్ తీసుకున్నారని, తాను నిజమే మాట్లాడినట్లు థాక్రే అభిప్రాయ పడినట్లు తెలిపారు.

పక్కనే బోసురాజు ఉన్నారని తాను మాట్లాడింది థాక్రేకు వివరించారని చెప్పారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న వివరణ తమ పార్టీ నేతలకు బోసురాజు వివరిస్తానని చెప్పారన్నారు. పార్టీ గెలుపు కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది థాక్రేతో చర్చించామన్నారు. చాణిక్య లాంటి సర్వే సంస్థలు గతంలో ఇచ్చిన ఫలితాలు నిజం అయ్యాయని అన్నారు. న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానెళ్లు తమ రేటింగ్ కోసం తన వ్యాఖ్యలను తప్పుగా ప్రజెంట్ చేశారని అన్నారు. కాగా కోమటిరెడ్డి వివరణ తర్వాత ఏఐసీసీకి థాక్రే రిపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Similar News