TGSRTC: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ రూట్‌లో ఆరు గ్రీన్ ఏసీ బస్సులు
హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని (Hyderabad IT employees) ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. (IT corridor commuters)ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగుల సౌకర్యార్థం ఆరు కొత్త (Green Metro Luxury Electric AC buses) గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఏర్పాటు చేశారు. 216W నెంబర్ గల బస్సు లింగంపల్లి- మెహాదీపట్నం రూట్‌లో నడవనుంది. వయా నల్లగండ్ల, విప్రో సర్కిల్, నానక్‌రామ్‌గూడా, కాజా గూడా, టోలిచౌకి, మెహిదీపట్నం రూట్ వరకు రాకపోకలు ఉంటాయి. 216G నెంబర్ గల బస్సు లింగంపల్లి-లక్ష్మీ జీఏఆర్.. వయా నల్లగండ్ల, క్యూ సిటీ, విప్రో సర్కిల్, లక్ష్మీ జీఏఆర్ రూట్‌లో రాకపోకలు సాగిస్తాయి. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని.. సంస్థను ఆదరించాలని సోమవారం సంస్థ ఎండీ సజ్జనార్ (SajjanarVC) ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈ బస్సుల్లో సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల ప్రయాణం ఉంటుందని తెలిపారు. కాగా, సజ్జనార్ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా లేవని, ప్రతి సారి కూడా బస్సు బ్రేక్ వేసే సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రసాద్ జూకంటి అనే నెటిజన్ కామెంట్ పెట్టారు. ఈ కామెంట్‌పై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది. పరిశీలనకు పలువురు అధికారులకు సూచనలు చేసింది. మరి మణికొండ ఐటీ వారికి లేవా సార్ బ్యాటరీ బండ్లు? అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.
