TG Venkatesh: రేవంత్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేస్తున్నావు.. ఇందంతా ఎందుకు? టీజీ వెంకటేశ్

రేవంత్ రెడ్డి నిర్ణయంపై టీజీ వెంకటేశ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-09-29 09:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చుతూ తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరును మార్చాలనుకుంటే అసెంబ్లీకి పెట్టాలని సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి సీటు కోసమే తెలంగాణ ఉద్యమం మొదలై రాష్ట్ర విభజన జరిగిందన్నారు. లేకుంటే సమైక్య రాష్ట్రంలో అందరం కలిసి చాలా బాగుండేవాళ్లమన్నారు. ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతం వాళ్లు సీఎం ఉండటం వల్ల తెలంగాణ వారు విసుగెత్తి పోయారన్నారు. విభజన సమయంలో తానే మొట్టమొదటి సారిగా సమైక్యాంద్ర ఉండాలని డిమాండ్ చేశాన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక టీజీ కనిపించకూడదనే టీఎస్ గా కేసీఆర్ పెట్టారన్నారు. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి టీజీగా మార్చారన్నారు. కేసీఆర్ తన  కుమారుడికి తారక రామరావు  పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేరును మార్చుతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పేర్లు మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులే అయినా ఆయన అన్ని వర్గాల వారి కోసం పోరాటం చేశారన్నారు. ఎన్నో మంచి పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి యూనివర్సిటీ పేరును మార్చడం ద్వారా ఓ వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారన్నారు. పేర్లు మార్చడం రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నారన్నారు. హైడ్రాపై స్పందిస్తూ బాధితుల్లో అనేక మంది పేద వారు ఉన్నారని వారికి ఆ స్థలాలు అమ్మి మోసం చేసి అధికారులు, అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. బాధికులకు పరిహారం అందించాలన్నారు.


Similar News