TG Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-07 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju)ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, దిల్ రాజ్‌ (Dil Raju) రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ (Telangana)లోని నిజామాబాద్ జిల్లా (Nizamabad) నర్సింగపల్లి (Narsingapally)లో దిల్ రాజు జన్మించారు. ముదక్‌పల్లి (Mudakpally), నిజామాబాద్‌లలో చదివిన ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. అనంతరం హైదరాబాద్‌ (Hyderabad)కు వెళ్లి సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారం చేశాడు. 1990లో పెళ్లి పందిరి (1997) చిత్రంతో మూవీ డిస్ట్రిబ్యూటర్‌గా కేరీర్‌ను ఆరంభించి ఆర్థికంగా ఎదిగారు. 2003లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Vekateshwara Creations) బ్యానర్‌ను స్థాపించి ‘దిల్’ సినిమాతో బంపర్ హిట్ కొట్టారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్‌వన్ నిర్మాతగా దిల్ రాజు కొనసాగుతున్నారు. 

Tags:    

Similar News