TG Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ (Assembly) కమిటీ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ (Assembly) కమిటీ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం ‘రికార్డ్స్ ఆఫ్ రైట్స్’ (Records of Rights) బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు (Panchayat Raj Act Amendment Bill)పై చర్చించి.. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా సవరణలకు ఆమోద ముద్ర వేయనున్నారు.
అదేవిధంగా ‘రైతు భరోసా’ (Raithu Bharosa) పథకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు యాదాద్రి (Yadadri), భద్రాద్రి (Bhadradri_ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌ఘడ్ (Chhattisgarh) విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ (Justice Madan B Lokur Commission) ఇచ్చిన నివేదికను మంత్రివర్గం పరిశీలించనుంది. ‘ఫార్ములా ఈ రేసింగ్’ (Formula E Racing) వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ (Governor) ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.