TG Budget-2024 : మహిళల కోసం ‘ఇందిరా జీవిత బీమా పథకం’.. ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు
కాంగ్రెస్ సర్కారు మహిళలకు మరో తీపి కబురు చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కారు మహిళలకు మరో తీపి కబురు చెప్పింది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.10 లక్షల జీవిత బీమా చేయడం జరిగిందని తెలిపింది. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. స్వయం సహాయక బృందాలలోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి గాను మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కు 3.20 ఎకరాల భూమిలో గల 106 దుకాణాలతో కూడిన నైట్ బజారు కాంప్లెంక్స్ ను అప్పగించినట్లు తెలిపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఇందుకు గాను పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.29,816 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది.