TG Assembly: రేవంత్‌రెడ్డి నాకు మంచి మిత్రుడే.. అసెంబ్లీలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి తనకు మంచి మిత్రుడేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-31 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి తనకు మంచి మిత్రుడేనని మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గత 18 ఏళ్ల నుంచి రేవంత్‌రెడ్డి తనకు పరిచయం అని అన్నారు. కాకపోతే గత పదేళ్ల నుంచి మాకు, ఆయనకు చెడిందని కామెంట్ చేశారు. చిన్న వయసులోనే రేవంత్‌రెడ్డికి అదృష్టం కలిసొచ్చిందని.. ఆయన కష్టానికి ఫలితం దక్కిందని అన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిని.. రేవంత్ అని సంబోధించగా.. అధికార పక్ష ఎమ్మెల్యేలు గారు అని సంబోధించాలంటూ గొడవ చేశారు. అందుకు సమాధానంగా కేటీఆర్ ఆయనకు లేని అభ్యంతరం మీకేంటని వారి ప్రశ్నించగా.. స్పీకర్ ప్రసాద్ కుమార్ కలుగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.     

Tags:    

Similar News

టైగర్స్ @ 42..