TG Assembly: చేసిన అప్పులను దాచి.. తిరిగి మాపైనే నిందలా?.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) చేసిన అప్పులను దాచి.. తిరిగి తమపైనే నిందలేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు.

Update: 2024-12-17 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) చేసిన అప్పులను దాచి.. తిరిగి తమపైనే నిందలేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన రాష్ట్ర అప్పులు, FRBM రుణ పరిమితిపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ (KCR) ప్రభుత్వం మార్చేసిందని అన్నారు. చేసిన అప్పులు దాచడమే కాకుండా.. తిరిగి తమపైకి మాటల దాడికి పాల్పడుతున్నారని పైర్ అయ్యారు. చేసిందంతా చేసి తమపైనే ప్రివిలేజ్ మోషన్ (Privilege Motion) ఇచ్చారని ధ్వజమెత్తారు. విపక్ష సభ్యులు సభకు, సభాపతికి కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఏసీ సమావేశం (BAC Meeting)లో కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వాకౌట్ చేసిందని అన్నారు. గడిచిన పదేళ్లలో బీఏసీ సమావేశం (BAC Meeting) ఎలా నిర్వహించారో మర్చిపోయారా అంటూ చురకలంటించారు. గతంతో పాటించిన నిబంధనలే తాము ఇప్పుడు పాటించాలి కదా అని సెటైర్లు వేశారు. సభలో కూడా ఎవరైనా రూల్ బుక్ ప్రకారమే నడుచుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  

Tags:    

Similar News