TG Assembly: అధికారం పోయాక బీఆర్ఎస్‌కు మతిపోయింది: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ శాసన‌సభలో రాష్ట్ర అప్పులు, FRBM రుణ పరిమితిపై వాడీ వేడి చర్చ జరుగుతోంది.

Update: 2024-12-17 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసన‌సభలో రాష్ట్ర అప్పులు, FRBM రుణ పరిమితిపై వాడీ వేడి చర్చ జరుగుతోంది. విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) రాష్ట్ర అప్పులపై ప్రభుత్వ పెద్దలవి అబద్దాలు అంటూ కామెంట్ చేశారు. అయితే, ఆ వ్యా్ఖ్యలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని.. సభలు వాస్తవాలు మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. అప్పుల పూర్తి లెక్కలను తము స్పష్టంగా వివరించి చెప్పామని అన్నారు.

సభను బీఆర్ఎస్ (BRS) పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇంకెన్నాళ్లు ప్రజలను ఏమార్చుతారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ (Assembly)లో చర్చ జరగాలనే తాము శ్వేతపత్రం (White Paper) విడుదల చేశామని అన్నారు. రాష్ట్ర అప్పులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ క్రమంలోనే భట్టి సవాలును తాము స్వీకరిస్తున్నామని.. చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ (BRS) తెలిపింది. తనకు హరీశ్ రావు మీదర చాలా గౌరవం ఉందని.. కానీ, అలాంటి వ్యక్తి సభ అన్న.. సభాపతి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఏసీలో సమావేశం నుంచి వాకౌట్ చేయాల్సిన అవసరం ఏముందని హరీశ్ రావును ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం పోయాక బీఆర్ఎస్ పార్టీకి మతిపోయిందిన భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.  

Tags:    

Similar News