TG Assembly : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేలకు స్పీకర్ కీలక రిక్వెస్ట్
అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరో 19 పద్దులపై శాసనసభలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక రిక్వెస్ట్ చేశారు. నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభ్యులను కోరారు. సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాశాఖలు, అటవీ, దేవదాయ, మైనార్టీ, చేనేత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పద్దులపై చర్చ జరగనుంది.