బండి సంజయ్ పై టెన్త్ స్టూడెంట్స్ ఫిర్యాదు
టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పదో తరగతి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పదో తరగతి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ బండి సంజయ్ పేపర్లను లీక్ చేయడం సరికాదని ఈ అంశంలో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోదావరిఖనికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయగా మరో చోట విద్యార్థిని ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
స్టూడెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతున్నాయి. అయితే ఫిర్యాదుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలతో ఇప్పటికే అభద్రతా భావంలోకి వెళుతున్న విద్యార్థులను ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.