రాష్ట్ర సర్కారు పాలనకు తాత్కాలిక బ్రేక్.. ఎమర్జెన్సీ పనులకే ప్రయారిటీ!

రాష్ట్ర ప్రభుత్వ పాలనకు నాలుగైదు రోజుల పాటు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. బీఆర్కే భవన్ నుంచి కొత్త సెక్రటేరియట్‌కు షిఫ్టింగ్ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

Update: 2023-04-27 01:38 GMT

రాష్ట్ర సర్కారు పాలనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కొత్త సచివాలయంలోకి షిఫ్టింగ్ పనులు జరుగుతుండటంతో మరో నాలుగైదు రోజుల వరకు రెగ్యులర్ ఫైల్స్ చూడటం కుదరదని అధికారులు చెబుతున్నారు. అక్కడ అంతా సెట్ అయ్యే వరకు ఫైల్స్ మూవ్ చేయడం ఉండదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్కే భవన్ లోకి సైతం ఇతరులను అనుమతించడం లేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వచ్చిన వారిని సైతం తిప్పి పంపుతున్నారు. మే 1 తర్వాత కొత్త సచివాలయానికి రావాలని సూచిస్తున్నారు. ఇక ఫైల్స్ షిఫ్టింగ్ కోసం కొత్త సెక్రటేరియట్‌లోకి అడుగు పెట్టిన అధికారులు షాక్‌కు గురైనట్టు తెలిసింది. వేల కోట్లు ఖర్చు చేసి ఇంత ఇరుకుగా క్యాబిన్లు నిర్మించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పాలనకు నాలుగైదు రోజుల పాటు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. బీఆర్కే భవన్ నుంచి కొత్త సెక్రటేరియట్‌కు షిఫ్టింగ్ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో రెగ్యులర్ ఫైల్స్ చూసేందుకు అవకాశం దొరకడం లేదు. కొత్త సెక్రటేరియట్‌లో అంతా సర్దుకునే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 30వ తేదీన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనుండటంతో.. అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అప్పటిలోగానే అన్ని శాఖలు షిప్ట్ కావాలని ఆదేశాలు జారీ కావడంతో సంబంధిత అధికారులు ఫైల్స్ సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. వాటితో పాటు ఇతర పరికరాలను తరలిస్తున్నారు. అక్కడ అంతా సెట్ చేసుకునేందుకు కనీసం ఐదారు రోజుల సమయం తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మే 1 వరకు రెగ్యూలర్ వర్క్స్ చూడటం కుదరదని అధికారులు చెబుతున్నారు.

అంతా సెట్ అయ్యే వరకు..

కొత్త సెక్రటేరియట్‌లో అంతా సెట్ అయ్యే వరకు ఫైల్స్ మూవ్‌మెంట్ ఉండకూడదని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. డైరెక్టరేట్స్ నుంచి వచ్చే ఫైల్స్‌నూ తీసుకోవడం లేదు. అలాగే ఓ సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు ఫైల్స్ ఇవ్వడం, తీసుకోవడం మానేశారు. ఎవరైన అధికారులు తమకు సంబంధిత ఫైల్స్ కావాలని అడిగినా ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. ఏ సెక్షన్‌లో ఉన్న పైల్స్ అక్కడే ఉంచాలని, ఒకవేళ ఫైల్ మిస్ అయితే సంబంధిత అధికారే బాధ్యత వహించాలని ఆదేశాలు రావడంతో ఆఫీసర్లు జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఫైల్స్ కదలికలకు బ్రేకులు పడ్డాయి.

విజిటర్స్‌కు నో ఎంట్రీ

ప్రస్తుతం బీఆర్కే భవన్‌లోకి విజిటర్స్‌ను అనుమతించడం లేదు. కొత్త సెక్రటేరియట్‌లో పరిస్థితులు సెట్ అయ్యాక అక్కడికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం వచ్చిన వారినీ బీఆర్కే భవన్‌లోని వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. సెక్రటేరియట్‌లో పూర్తిగా సర్దుకునే వరకు మంత్రులు, సంబంధిత కార్యదర్శుల మధ్య ఫైల్స్ వర్క్ ఉండవని అధికారులు చెప్తున్నారు. అత్యవసరమైన పని ఉంటే మౌఖిక అదేశాల మేరకు నిర్ణయాలు ఉంటాయని వివరించారు. ముందుజాగ్రత్తగా అత్యవసరమైన ఫైల్స్‌ను ఆయా శాఖల సెక్రటరీలు తమ పేషీ వద్ద ఉంచినట్టు తెలుస్తున్నది. సీఎం‌తో పాటు సీఎంఓ అధికారులు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేందుకు రెడీగా పెట్టుకున్నట్టు సమాచారం.

సిబ్బందిలో అంసతృప్తి

కొత్త సెక్రటేరియట్‌లోకి డిపార్ట్‌మెంట్ల షిప్టింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. ఫస్ట్ రోజు లోనికి వెళ్లిన ఎంప్లాయీస్, అధికారులు, చివరికి ఐఏఎస్‌లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఇంత ఇరుకుగా నిర్మించారని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తమకు కేటాయించిన ఏరియాను చూసిన ఫైర్ అవుతున్నారు. ఇంత ఇరుకైన క్యాబిన్లలో ఎలా పనిచేయాలని జీఏడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఫైల్స్‌ను ఎక్కడ పెట్టుకోవాలని నిలదీస్తున్నారు. ఏ శాఖకు ఎంత మేరకు స్థలం కేటాయించాలో తెలియదా? అని చాలా మంది ఐఏఎస్‌లు సైతం జీఏడీపై సీరియస్ అయినట్టు తెలుస్తున్నది. దీంతో జీఏడీ అధికారులు సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉన్నట్టు టాక్.

అక్కడొకరు.. ఇక్కడొకరు..

కొత్త సెక్రటేరియట్‌లో మంత్రులు, ఆ శాఖకు చెందిన సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ అధికారులు, వారికి సపోర్టుగా పనిచేసే సెక్షన్ ఆఫీసర్లు అందరూ ఒకేచోట ఉండేలా ఏర్పాట్టు చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ, పేషీలకు ఒకచోట, సెక్రటరీలకు మరో చోట, అడిషన్ సెక్రటరీ‌కు ఇంకోచోట కేటాయింపులు చేయడంపై గుర్రుగా ఉన్నారు. సెక్రటేరియట్ లోని సర్వీస్ రూల్స్ ప్రకారం అడిషనల్ సెక్రటరీ హోదా పెద్దది, కానీ ఆయన కింద పనిచేసే జాయింట్ సెక్రటరీలకు వారికంటే పెద్ద చాంబర్లు ఇచ్చారని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News