Telangana Weather: చలి పంజా.. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్

హైదరాబాద్ లో చలి పంజా విసురుతోంది. ఒక్క హైదరాబాద్ (Hyderabad Weather) లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రంగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేదు.

Update: 2024-11-29 06:17 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో చలి పంజా విసురుతోంది. ఒక్క హైదరాబాద్ (Hyderabad Weather) లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రంగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేదు. ఎండ కాస్తున్నా.. చలి మాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం 6 గంటల తర్వాత బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు. మంచుకు, శీతల గాలులు తోడవ్వడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా.. మెదక్ లో 11.4, పటాన్ చెరులో 12.2 డిగ్రీలు, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 13.8 డిగ్రీలు, నిజామాబాద్ లో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేడు హైదరాబాద్ లో (Hyderabad Temperature) కనిష్ట ఉష్ణోగ్రత 15.73 డిగ్రీల సెల్సియస్ గా నమోదవ్వగా.. గరిష్ట ఉష్ణోగ్రత 23.9 డిగ్రీల సెల్సియస్ గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో చలితీవ్రత పెరగడంతో.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Tags:    

Similar News