Himachal Pradesh Rains : హిమాచల్ ప్రదేశ్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. స్పందించిన కేటీఆర్
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇక హిమాచల్‌లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. హిమాలయాల్లో ఉన్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. మనాలి వద్ద ఉన్న బియాస్ నది ఉప్పొంగుతోంది. వేగంగా ప్రవహిస్తున్న ఆ నది ధాటికి.. టూరిస్టులకు చెందిన కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.
మనాలిలో బియాస్ నది సమీపంలో పార్క్ చేసిన కార్లన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మహదేవ్ టెంపుల్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలో చిక్కుకున్న వారిలో తెలుగు విద్యార్థులు సైతం ఉన్నారు. దీంతో వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా.. ఈ ఇన్సిడెంట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. కులు, మనాలిలో విద్యార్థులు చిక్కుకున్నట్లు కేటీఆర్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌ను అప్రమత్తం చేశామని తెలిపారు. బాధిత విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు వెల్లడించారు. సహాయం కోసం టీఎస్ భవన్, కేటీఆర్ ఆఫీసులో సంప్రదించాలని బాధితులకు సూచించారు.