భాషపై పట్టులేని తెలంగాణ విద్యార్థులు

తెలంగాణ విద్యార్థులు భాషపై పట్టు కోల్పోతున్నారు.

Update: 2024-02-06 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ విద్యార్థులు భాషపై పట్టు కోల్పోతున్నారు. తాజాగా కేంద్ర విద్యాశాఖ వెలువరించిన ఎఫ్ఎల్ఎస్ స్టేట్ రిపోర్ట్ 2022లో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలోని 59 శాతం మంది విద్యార్థులు తెలుగు భాషలో కనీస ప్రావీణ్యత ప్రమాణాలకు సరిపోలడం లేదని ఈ నివేదిక వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే వెనుకబాటుగా నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో భాష పరంగా వెనుకబడిన 10 జిల్లాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ఈ నివేదికపై నిన్న లోక్ సభలో చర్చ జరిగింది. తెలంగాణలో 349 స్కూల్, 602 మంది టీచర్లు, 3313 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఓరల్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ధ్వనుల అవగాహన, డీకోడింగ్ వర్డ్స్, నాన్-వర్డ్స్ డీకోడింగ్,పిక్చర్ మ్యాచింగ్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ మరియు కాంప్రహెన్షన్ ఆధారంగా విద్యార్థుల భాషా సామర్థ్యాలను అంచనా వేశారు.

Tags:    

Similar News