శివసేన పార్టీ సెంట్రల్ కార్యదర్శితో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ భేటీ..

శివసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముంబై నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీకి పిలుపు రావడంతో ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపి కిషణ్‌ వెళ్లారు.

Update: 2023-08-15 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: శివసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముంబై నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీకి పిలుపు రావడంతో ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి గోపి కిషణ్‌ వెళ్లారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ సెంట్రల్ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్‌తో భేటీ అయిన సింకారు శివాజీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల పైన చర్చించడంతో పాటుగా పార్టీ బలోపేతం కోసం కార్యాచరణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ మాట్లాడుతూ.. సెంట్రల్ కార్యదర్శి అభిజిత్ అడ్సుల్‌‌తో జరిగిన భేటీలో కీలకమైన అంశాల పైన చర్చించిన్నట్టు తెలిపారు.


రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రణాళిక సిద్ధం చెయ్యాలని హైకమాండ్‌ తెలిపినట్టు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ భౌగోళిక సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాలలో ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ బలోపేతం చేసేందుకు సిద్ధం అవ్వాలని అభిజిత్ అడ్సుల్‌ సూచన చేశారన్నారు.

శివసేన పార్టీ అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆహ్వానించిన విషయం తెలిపారు. త్వరలో ఏకనాథ్ షిండేతో హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ఏక్‌నాథ్ షిండే ముఖ్య అతిదులుగా పాల్గొంటారన్నారు. 1200 మంది తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహస్య మిత్ర పార్టీలు MIM, బీఆర్ఎస్ లకు శివసేన సత్తా చూపిస్తామన్నారు.


Similar News