పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ శివసేన పార్టీ మద్దతు

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీకి ఏక్‌నాథ్ శిండే వర్గం తెలంగాణ శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Update: 2024-04-29 11:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీకి ఏక్‌నాథ్ శిండే వర్గం తెలంగాణ శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ కూటమి లో భాగంగా ఉన్న శివసేన పార్టీ ఇవాళ ముంబై సెంట్రల్ కార్యాలయం నుంచి బీజేపీ పార్టీకి మద్దతు తెలపాలని లేఖను విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి లో భాగంగా తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో శివసేన పోటీ చేయడం లేదని పార్టీ వెల్లడించింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సదర్భంగా ఇవాళ హిమాయత్ నగర్‌లోని శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశంలో శివసేన సింకారు శివాజీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారు ఈ సారి ప్రజలు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అహంకారానికి, అవినీతికి పెద్దపీట వేసి ప్రజలకు దూరమైందన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సుధాకర్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు టీ రాజారావ్, రాహుల్, వెంకటేశ్, అఖిల్‌, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News