TS New Secretariat Building తాజ్‌మహాల్‌ కాదు.. తెలంగాణ సచివాలయం (వీడియో)

తెలంగాణ నూతన సెక్రటేరియట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Update: 2023-01-29 12:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నూతన సెక్రటేరియట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాదాపు పూర్తికావొచ్చిన సచివాలం.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటుంది. దీనిని ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు నాడు ప్రారంభించేందుకు అధికారులు ముహుర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున పొగ మంచులో సచివాలయం వీడియో ఆకట్టుకుంటుంది. సొగసు చూడతరమా... 'యమునా నది ఒడ్డున తాజ్‌మహాల్.. హుస్సేన్ సాగర్ ఒడ్డున సచివాలయం. తెల్లని పొగమంచులో సచివాలయం తాజ్‌మహల్‌ను తలపిస్తోంది' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News