ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు రికార్డు
మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు రికార్డు సాధించారు. ఈ ఏడాది ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన దాదాపు 30 వేల ఫోన్లను రికవరీ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు రికార్డు సాధించారు. ఈ ఏడాది ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన దాదాపు 30 వేల ఫోన్లను రికవరీ చేశారు. ఈ క్రమంలోనే దేశంలో ఫోన్ల రికవరీలో రెండో స్థానాన్ని సాధించినట్టు ఏడీజీ మహేశ్ భగవత్ తెలిపారు. ఫోన్ దొంగతనం లేదా మీ మొబైల్ కనిపించకుండా పోయిన వెంటనే బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్, సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది కూడా ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు రికార్డు సాధించారు.
దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. కాగా, రాష్ట్రంలో ఒక ఏడాదిలో 1.73 లక్షల మొబైల్ ఫోన్‌లు పోయినట్లు ఫిర్యాదులు అందితే వాటిలో 35 శాతం మాత్రమే రికవరీ చేయగలిగారు. గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నవి కేవలం 29,500 మొబైల్ ఫోన్‌లు మాత్రమే. ఇంకా 1.43 లక్షల ఫోన్‌లు మిస్సింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం. వీటి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.