బిగ్ బ్రేకింగ్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఫిక్స్

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది.

Update: 2023-03-10 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. గతంలో ఒకసారి వాయిదా పడ్డ తెలంగాణ నూతన సెక్రటేరియట్ ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభం కానుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అమర వీరుల స్థూపం, డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహా ప్రారంభోత్స తేదీలను కూడా తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది.

డా. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన ట్యాంక్ బండ్ సమీపంలో నిర్మిస్తోన్న 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రభుత్వం నిర్మిస్తోన్న మరో ప్రతిష్టాత్మక కట్టడం అమరవీరుల స్థూపాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. మొదట ఏప్రిల్ 14వ తేదీనే అంబేద్కర్ విగ్రహాంతో పాటు అమరు వీరుల స్థూపాన్ని ప్రారంభిస్తారని వార్తలు వినిపించగా.. తాజాగా ప్రభుత్వం వేర్వేరు తేదీల్లో ఓపెనింగ్ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్రారంభోత్సవ తేదీలను గులాబీ బాస్ వేర్వేరుగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News