వైద్య శాఖ కీలక నిర్ణయం.. గర్భిణులకు తలసిమియా స్క్రీనింగ్
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్ నివారణకు వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.Latest Telugu News
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్‌సెల్ నివారణకు వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే 11 జిల్లాల్లోని గర్భిణులకు స్క్రీనింగ్ చేయనున్నారు. పుట్టబోయే బిడ్డలు ఈ డిసీస్ బారిన పడకుండా ముందస్తుగా పరీక్షలు చేయనున్నారు. ఈ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గర్భం దాల్చి మొదటి యాంటీనాటల్ చెకప్(ఎఎన్‌సీ) చేయించుకున్న మహిళకు ఈ టెస్టులు చేయనున్నారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్కేంద్రాలకు పంపుతారు. సీబీసీ(కంప్లీట్ బ్లడ్ కౌంట్,) హెచ్‌బీఏ -2 టెస్టు, సికిల్ స్కాన్ చేస్తారు. వాటిలో తలసేమియా జీన్‌ను గుర్తిస్తారు.
ఒక వేళ గర్భిణుల్లో ఈ సమస్య ఉంటే వెంటనే ఆమె భర్త రక్త నమూనాలనూ సేకరిస్తారు. వాటిలోనూ అబ్నార్మల్అని తేలితే హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్‌కు పంపుతారు. ఇద్దరికీ కలిపి జెనిటిక్ సీక్వెన్సింగ్ చేస్తారు. గరిష్ఠంగా 20 వారాల్లోపు గర్భిణులకే ఈ స్క్రీనింగ్ ఉంటుంది. ఈ పరీక్షల కోసం వైద్యశాఖ హెచ్‌బీఎల్సీ యంత్రాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేసింది. 11 వేల మంది గర్భిణులకు తొలిదశలో ఈ స్క్రీనింగ్ చేయనున్నారు. అందుకోసం 1200 మంది స్టాఫ్‌కు ట్రైనింగ్ఇచ్చినట్లు ఫ్యామిలీ వెల్ఫేర్డిపార్ట్మెంట్కు చెందిన ఓ అధికారి తెలిపారు.