బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం.. జాతీయ జెండా ఎగురవేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంది.

Update: 2024-09-17 03:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంది. కాగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు జరపడం మూడోసారి. ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కావాల్సి ఉండగా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన దూరమయ్యారు. గతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పలు జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల సీఎంలు కానీ, మంత్రులు కానీ, వారి ప్రతినిధులు కానీ హాజరయ్యేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. ముఖ్య అతిథులు లేకుండానే ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం నేరుగా పరేడ్ గ్రౌండ్ చేరుకున్న ఆయన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.


Similar News