దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా తెలంగాణ

ప్రధానమంత్రి అర్థిక సలహామండలి(PMEAC) విడదుల చేసిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. భారత దేశంలోనే టాప్ ధనిక, టాప్ పేద రాష్ట్రాల లిస్ట్ ను PMEAC ఇచ్చింది.

Update: 2024-09-18 16:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి అర్థిక సలహామండలి(PMEAC) విడదుల చేసిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. భారత దేశంలోనే టాప్ ధనిక, టాప్ పేద రాష్ట్రాల లిస్ట్ ను PMEAC ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణ Telangana దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా నిలిచింది. అలాగే మొదటి స్థానంలో రాజధాని ఢిల్లీ నిలిచింది. అలాగే మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో హరియాణా, ఐదో స్థానంలో తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. మరోపక్క దేశంలోనే అత్యంత పేద రాష్ట్రాల్లో బీహార్ ఎప్పటిలాగే మొదటి స్థానంలో ఉండగా.. ఝార్ఖండ్ రెండో స్థానంలో, యూపీ మూడో స్థానంలో, మణిపూర్ నాలుగో స్థానంలో. అస్సాం ఐదో స్థానంలో నిలిచాయి. కాగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈ జాబితాను రాష్ట్రాల తలసరి ఆదాయాన్ని ప్రమాణికంగా చేసుకొని రూపొందిస్తుంది.


Similar News