స్పీకర్ విషయాల్లో కోర్టుల జోక్యం చేసుకోరాదు.. హైకోర్టులో దానం, కడియం తరపున లాయర్లు

ఎమ్మెల్యేల పార్టీ మార్పు పిటినషన్ విచారణ ఈనెల 30 కి వాయిదా పడింది.

Update: 2024-07-26 10:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని దానం, కడియం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను లాయర్ మయూర్ రెడ్డి చదివి వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ పిటిషన్ పై నిన్నటి విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలపై అనర్హత కు సంబంధించి స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులకు సమీక్షించే అధికారం ఉంటుందని ఏజీ నిన్న హైకోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News