Breaking: ఎంపీ అవినాశ్ బెయిల్‌పై విచారణ వాయిదా

వివేకానందారెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కడప ఎంపీ అశినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారించింది. తన తల్లి ఆరోగ్య పరిస్థితుల దృష్యా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు...

Update: 2023-05-25 14:09 GMT

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కడప ఎంపీ అశినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారించింది. తన తల్లి ఆరోగ్య పరిస్థితుల దృష్యా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు వర్గాల వాదనలను పరిశీలించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి వాదనలను కూడా విన్న తర్వాత కీలక తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ ఆయన వర్గీయుల్లో నెలకొంది. ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే అవినాశ్ రెడ్డిని అరస్ట్ చేస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పింది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలని ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే తన తల్లి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులు విచారణ నుంచి తనకు మినహాయించాలని కోరారు. అటు సీబీఐ మాత్రం అవినాశ్ రెడ్డి లేఖపై ఎలాంటి స్పందన చూపలేదు. దీంతో అవినాశ్ రెడ్డిని కచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది.

ప్రస్తుతం అవినాశ్ రెడ్డి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద తల్లి శ్రీలక్ష్మీతో పాటు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని ఆయన వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.  

ఇవి కూడా చదవండి: 

Mp Gvl: ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna: జగన్ సూత్రధారి.. అవినాశ్ పాత్రధారి

Tags:    

Similar News