కొత్త జిల్లాల్లోనూ సీఎమ్‌ఎస్‌లు.. త్వరలోనే శంకుస్థాపనలు

జిల్లాకో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పాత జిల్లాల్లోనే సీఎమ్‌ఎస్‌లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది

Update: 2024-10-06 02:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లాకో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పాత జిల్లాల్లోనే సీఎమ్‌ఎస్‌లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఒక్కో సీఎంఎస్‌ను నాలుగు కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే బిల్డింగ్ నమూనాలు, స్టోరేజ్ సేప్టీ వంటి వాటిపై ఇంజినీర్లు ప్రభుత్వానికి రిపోర్టు కూడా ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే వీటి శంకుస్థాపనలు హెల్త్ మినిస్టర్ చేతుల మీదుగా జరగనున్నాయి. ఈ కేంద్రాలన్నీ అందుబాటులోకి వస్తే హాస్పిటల్స్‌లో మందుల కొరత అనేది ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగా ఉండటం వల్ల సకాలంలో ఇండెంట్ ఇవ్వకపోవడం, ఇచ్చినా, సమయానికి మందులు సప్లై చేయడం లేదు. హాస్పిటల్ అధికారులకు, సీఎమ్ ఎస్ స్టాఫ్కు సరైన సమన్వయం లేక గందరగోళంగా మారుతుంది. దీంతో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం వల్ల అన్ని ఆసుపత్రుల యావరేజ్‌ను బేస్ చేసుకొని మూడు నుంచి ఆరు నెలల బఫర్ స్టాక్‌ను ముందే పెట్టేందుకు వీలుంటుందని డాక్టర్లు వివరిస్తున్నారు.


Similar News