Breaking News : విద్యార్థులకు సర్కార్ దీపావళి కానుక
దీపావళి(Diwali) పండగపూట తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో గుడ్ న్యూస్ తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్ : దీపావళి(Diwali) పండగపూట తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని గురుకుల, హాస్టల్స్ విద్యార్థులకు మేలు చేకూరేలా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల గురుకులాలు, పలు సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాల్లోని విద్యార్థుల కాస్మోటిక్స్, డైట్ చార్జీలను పెంచింది. ప్రస్తుతం 3 నుంచి 7వ తరగతి వరకు ఉన్న డైట్ ఛార్జీలు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలు రూ.1330కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు.. రూ.1100 నుంచి రూ.1540కి పెంచారు. ఇక ఇంటర్ నుండి పీజీ వరకు.. రూ.1500 నుంచి రూ.2100కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాస్మోటిక్ ఛార్జీలు 3 నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం రూ.55 ఉండగా.. దానిని రూ.175కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275 వరకు పెంచారు. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.