మహిళలకు కేసీఆర్ గుడ్ న్యూస్.. వడ్డీలేని రుణాలు విడుదల?

మహిళలకు సీఏం కేసీఆర్ తీపికబురు అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా,750 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేసింది సర్కార్. పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు పట్టణ,

Update: 2023-03-07 03:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు సీఏం కేసీఆర్ తీపికబురు అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా,750 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల నిధులను విడుదల చేయడానికి రెడీ అయ్యింది సర్కార్. పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వడ్డీ లేని రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా ప్రతి సంవత్సరం మహిళలకు చెల్లిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో  2017    నుంచి వడ్డీలేని రుణాలను విడుదల చేయడం లేదు ప్రభుత్వం. కాగా,  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని,   పురపాలికల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కోసం250 కోట్ల రుపాయల వడ్డీలేని రుణాలు, మరో 500 కోట్ల రుపాయలను గ్రామీణ ప్రాంతల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు మార్చి  8 న విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో మహిళల ముఖాల్లో సంతోషం వెళ్లివిరిసింది.

Tags:    

Similar News