Breaking : స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సర్కార్ స్కూళ్ల పరిశుభ్రత పై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది.

Update: 2024-08-05 12:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సర్కార్ స్కూళ్ల పరిశుభ్రత పై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’కి అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో పరిశుభ్రత పై దృష్టి సారించిన నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం గ్రాంటును మంజూరు చేశారు. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంటును సర్కార్ కేటాయించింది.

విద్యార్థుల సంఖ్య ఆదారంగా ప్రభుత్వం గ్రాంట్‌ను విడుదల చేసింది. మొత్తంగా పది నెలలకు కలిపి ఒకేసారి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 30 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ. 3 వేల గ్రాంటుగా ఇవ్వనుంది. 31 నుంచి 100 మంది ఉన్న విద్యార్థులున్న బడులకు రూ.6 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.12 వేలు, 750 విద్యార్థులకు పైగా ఉంటే రూ. 20 వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది.

Tags:    

Similar News