BREAKING: కార్మికులకు గుడ్ న్యూస్.. వేతనం కూడిన సెలవు మంజూరు చేసిన సర్కార్
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు బై పోల్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు బై పోల్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లా కేంద్రాలలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ సెంటర్ల నుండి ఈవీఎంలు, కంట్రోలింగ్ మిషన్స్, వీవీ ప్యాట్స్‌ను ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్‌లకు తరలించారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తోన్న ప్రతి ఒక్క కార్మికుడు ఓటు హక్కు వినియోగించుకోవాలనే నేపథ్యంలో పోలింగ్ డే (మే 13) రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ డే రోజున కచ్చితంగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.