సజ్జల వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ ఐఏఎస్ కౌంటర్!

కుదిరితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే వైసీపీ విధానం అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది.

Update: 2022-12-09 05:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కుదిరితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే వైసీపీ విధానం అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా తాజాగా సజ్జల వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ ఆకునూరి మురళి రియాక్ట్ అయ్యారు. కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా కోరిక అన్న సజ్జలకు.. 'కుదరదు సజ్జల గారు' అంటూ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఆకునూరి మురళి.. వెయ్యి మంది అమరుల ప్రాణత్యాగంతో ఏర్పడిన తెలంగాణను వదులుకోబోమన్నారు. ఇంటి దొంగలను పంపించేసి మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని, అభివృద్ధిలో ఒక యూరోపియన్ దేశంలా అవినీతి లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పాటైన రాష్ట్రం తిరిగి సమైఖ్యాంధ్రలో కలవనివ్వమని అమరవీరులకు జోహార్లు అంటూ ట్వీట్ చేశారు.

Read More....

రక్తం చిందించని ఆయుధం ఓటు : విశారాదన్ మహారాజ్ 

Tags:    

Similar News