నిధులు చేతకానివారు నిందలు వేస్తారు.. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్

రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు తీసుకురావడం తెలియని కిషన్ రెడ్డికి నిందలువేయడం మాత్రం బాగా వచ్చని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ఎ ద్దేవా చేశారు.

Update: 2023-08-14 15:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు తీసుకురావడం తెలియని కిషన్ రెడ్డికి నిందలువేయడం మాత్రం బాగా వచ్చని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ఎ ద్దేవా చేశారు. అప్పు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆరోపించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అప్పుగురించి మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మోడీ 9 ఏళ్లలో చేసిన రూ. 100 లక్షల కోట్ల అప్పు గుర్తులేదా అని మండిపడ్డారు. ఒక్క వేలుతో ఇతరులను నిందిస్తే నాలుగు వేళ్లు మనల్నే ప్రశ్నిస్తాయనే విషయం మర్చిపోవద్దన్నారు. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఉన్న ఆదరణను చూడలేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారని భయపడే బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్ తీసుకువచ్చిన అప్పుతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సాగునీరు అందిస్తుందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పుతో ఏం సాధించారో చెప్పాలని అయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ 7వేల కోట్ల భూములు అమ్మిందని గగ్గోలు పెట్టే బీజేపీ నేతలకు లక్ష కోట్ల ప్రభుత్వ రంగ సంస్ధలను మోడీ అమ్మితే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశంలో గతంలో 14 మంది ప్రధాన మంత్రులు 67 ఏళ్లలో రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. 9 ఏళ్లలో మోడీ ఒక్కడే 100లక్షల కోట్ల అప్పు చేశాడని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే మోడీని అప్పుపై ప్రశ్నించాలని సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక క్రమశిక్షణలో ముందుందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటిస్తే గల్లి నేతలు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News