Governor : గవర్నర్ జిష్ణుదేవ వర్మను కలిసిన తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల(Lagacharla)లో వికారాబాద్ కలెక్టర్, అధికారులపైన దాడికి పాల్పడిన వారిపై, ప్రేరేపించిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Deva Varma)కు తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (Employees JAC)వినతి పత్రం అందించింది.
దిశ, వెబ్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల(Lagacharla)లో వికారాబాద్ కలెక్టర్, అధికారులపైన దాడికి పాల్పడిన వారిపై, ప్రేరేపించిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Deva Varma)కు తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (Employees JAC)వినతి పత్రం అందించింది.
ఈ కార్యక్రమంలో జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న స్థానికులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 47మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిలో సగం మందికి పైగా అరెస్టు చేసి రిమాండ్ చేశారు. దాడి వెనుక బీఆర్ఎస్ ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దాడి కేసులో అమాయక రైతులను వేధిస్తున్నారంటూ బీఆర్ఎస్ సైతం ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేసింది.