అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు.. చీఫ్ గెస్టులుగా రాహుల్, రేవంత్!
అమెరికాలోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో జరిగే ఈ వేడుకలకు కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డిలు పాల్గొననున్నట్లు వెల్లడించారు.
2వ తేదీ వాషిగ్టంన్‌లో జరిగే సభకు రేవంత్ రెడ్డి చీఫ్‌గెస్టుగా రానుండగా, 4వ తేదిన న్యూయర్క్‌లో జరిగే సభకు రాహుల్‌గాంధీ హజరు కానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు, ఇతర ప్రతినిధులందరినీ ఆ సభలకు ఆహ్వానించినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్న నీళ్లు, నియామకాలు, నిధులు అంశంపై చర్చ జరుగుతుందన్నారు. అంతేగాక బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా డిస్కన్షన్స్ఉంటాయని స్పష్టం చేశారు.
ఆవిర్భావ దినోత్సవ కమిటీలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవ కమిటీలను ఏర్పాటు చేసింది. చైర్మన్‌తో పాటు ఇద్దరు కో చైర్మన్లు, ఇద్దరు కన్వీనర్లు, ఐదుగురు కో ఆర్డినేటర్లు, 19 మెంబర్లతో జంబో కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ ఈ కమిటీ మానిటరింగ్ చేస్తుంది.