జర్నలిస్టులకు విద్యాశాఖ శుభవార్త
జర్నలిస్టులకు విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే జర్నలిస్టు పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: జర్నలిస్టులకు విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే జర్నలిస్టు పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం డీఈఓ(డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్) సర్క్యూలర్ జారీ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ అధికారులను కలిసి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టులు (హెచ్ యూజే)/టీడబ్య్లూజేఎఫ్ ప్రతినిధి బృందం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు వినతి పత్రం అందించింది. దీనికి డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ హైదరాబాద్‌లోని అన్ని ప్రైవేట్ పాఠశాలల సర్క్యూలర్ జారీ చేశారు. 2023-2024 విద్యాసంవత్సరానికి గాను 50 శాతం రాయితీ కల్పించాలని అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇది కేవలం హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టులకు మాత్రమే వర్తిస్తుంది.