తెలంగాణ ఎంసెట్,ఈసెట్ నోటిఫికేషన్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Update: 2022-03-28 11:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. జూన్​7 వరకు రూ.250 ఆలస్య రుసుముతో, జూన్​17 వరకు రూ.500 ఆలస్య రుసుముతో, రూ.2500 ఆలస్య రుసుముతో జూన్​27 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో జూలై 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు జూన్ ​25వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. అగ్రికల్చర్, మెడికల్​ విద్యార్థులకు జూలై 14, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్​ విద్యార్థులకు జూలై 18, 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్​ పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఎంసెట్ క‌న్వీన‌ర్ సూచించారు. ఏదైనా ఒక స్ట్రీమ్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్)​కు మాత్రమే దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరీల అభ్యర్థులు రూ. 800 చెల్లించి, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాలి. అదే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్​రెండు స్ట్రీమ్​లకు కలిపి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.800, ఇతర కేట‌గిరీల అభ్యర్థులు రూ.1600 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాలి.

టీఎస్​ఈసెట్​2022 నోటిఫికేషన్ కూడా ​విడుదలైంది. ఏప్రిల్​6వ తేదీ నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఈసెట్​కన్వీనర్​ విజయకుమార్​రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. జూన్​8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జూన్​14వ తేద వరకు రూ.500 ఆలస్య రుసుముతో, రూ.2500 ఆలస్య రుసుముతో జూలై 6వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి 20వ తేదీ వరకు కరెక్షన్​కు అవకాశం కల్పించారు. జూలై 8వ తేదీ నుంచి హాల్​టికెట్లు డౌన్​లోడ్​కు అవకాశం కల్పించారు. జూల్​17వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400 ఫీజుగా నిర్ణయించారు. ఇతరులు రూ.800 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఈసెట్​కన్వీనర్​విజయ కుమార్​రెడ్డి వెల్లడించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..