Telangana DGP: ఈ కార్యక్రమం టీం స్పిరిట్‌ను పెంచుతుంది.. డీజీపీ జితేందర్

పోలీస్ డ్యూటీ మీట్ ప్రోగ్రామ్ టీం స్పిరిట్ ను పెంచుతుందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు.

Update: 2024-10-16 07:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ డ్యూటీ మీట్ ప్రోగ్రామ్ టీం స్పిరిట్ ను పెంచుతుందని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. రాజేంద్రనగర్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మహేశ్‌ భగవత్‌, శిఖా గోయల్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ పోటీలలో వివిధ జిల్లాలకు చెందిన 400 మంది పోలీసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తదితర వాటిల్లో పోలీసులకు పోటీలు నిర్వహిస్తారు. అలాగే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్‌ అవగాహనపై కూడా పోటీలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా కేసుల ఛేదన, ఆధారాల సేకరణపై ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పోలీసులలో టీం స్పిరిట్‌ని పెంచుతాయని తెలిపారు. అలాగే నిరంతరం నేర్చుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తుంటేనే నేరాల ఛేదన సాధ్యమవుతుందని సూచించారు. న్యాయం జరిగితేనే బాధితులకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం వస్తుందని డీజీపీ స్పష్టం చేశారు. 


Similar News