1200 మంది కళాకారులతో సీఎంకు గ్రాండ్ వెల్‌కమ్.. ఏర్పాట్లపై DGP సమీక్ష
ఈనెల 15న చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్శుక్రవారం ఏర్పాట్లపై వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఈనెల 15న చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్శుక్రవారం ఏర్పాట్లపై వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. 15న ముఖ్యమంత్రి కేసీఆర్అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్సూచించారు.
సందర్శకుల కోసం ఎల్ఈడీ స్ర్కీన్లు
స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యేవారు సభా ప్రాంగణానికి ఎంత దూరంలో ఉన్నా కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్అశోక్రెడ్డి తెలిపారు. కార్యక్రమం లైవ్కవరేజీ కోసం 10 కెమెరా యూనిట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. అలాగే లైవ్లింకింగ్ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఇక, సభకు వచ్చే అతిధులు, అధికారులు, సందర్శకులు, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్జలమండలి ఆధ్వర్యంలో లక్ష వాటర్ప్యాకెట్లు, 25వేల వాటర్‌బాటిళ్లను అందచేయనున్నట్టు ఆ సంస్థ ఎండీ దానకిషోర్చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో నాలుగు అంబులెన్సులు, గోల్కొండ ప్రైమరీ హెల్త్‌సెంటర్‌లో ఓ గదిని సిద్ధంగా ఉంచామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇక, మూడు ఫైరింజన్లు, ఆరు బెస్ట్బైకులు, నాలుగు ల్యాడర్లను ఏర్పాటు చేయనున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. వర్షం పడినా విద్యుత్‌సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక జనరేటర్లు, వాటర్ఫ్రూఫ్షెడ్లను ఏర్పాటు చేయనున్నట్టు విద్యత్‌శాఖ, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 12వందల మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్హరికృష్ణ చెప్పారు.
పార్కింగ్ ఏర్పాట్లు...
సమీక్ష సందర్భంగా పార్కింగ్ ఏర్పాట్లపై డీజీపీ అంజనీకుమార్ఆరా తీశారు. మొత్తం 1,930 వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టు హైదరాబాద్ట్రాఫిక్అదనపు కమిషనర్సుధీర్బాబు తెలిపారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీడియా వారికి, సందర్శకులకు వేర్వేరుగా పార్కింగ్‌స్థలాలు కేటాయించినట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్ఏర్పాట్లు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్పోలీస్కమిషనర్సీ.వీ.ఆనంద్, అదనపు డీజీ స్వాతి లక్రా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్దేవసేన, ప్రొటోకాల్డైరెక్టర్అరవింద్సింగ్, టూరిజం కార్పోరేషన్ఎండీ మనోహర్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.