తప్పు చేయకుంటే భయమెందుకు.. మోడీ సర్కార్‌ను నిలదీసిన కూనంనేని
అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని మోడీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిలదీశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రధాని మోడీకి భయమెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిలదీశారు. మోడీ ఎలాంటి తప్పులు చేయకుంటే జేపీసీ వేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సోమావారం హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. హిండెన్‌బెర్గ్ నివేదికతోనే అదానీ గుట్టురట్టు అయ్యిందన్నారు.
అదానీ కుంభకోణాలను వెలికితీయాలని ప్రతిపక్షాలు, వామపక్షపార్టీలు డిమాండ్ చేస్తుంటే, ప్రధాని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. తక్షణమే అదానీని అరెస్టు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మోడీ అండదండలతో అదానీ ప్రపంచ కుబేరులలో స్థానం పొందారని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, ఎన్. బాలమల్లేష్, వి.ఎస్. బోస్, ఇ.టి. నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.
Also0 Read..
కేసీఆర్ క్రెడిబులిటీ కోల్పోయారు.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్