బీఆర్ఎస్ కట్టబెట్టింది తిరిగివ్వాలని ప్రజా ప్రభుత్వం కోరింది.. ‘దిశ’ కథనంపై కాంగ్రెస్ ట్వీట్
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులు, బ్లాకుల్ని ప్రైవేటుకు ఇవ్వొద్దని, దానికే ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులు, బ్లాకుల్ని ప్రైవేటుకు ఇవ్వొద్దని, దానికే ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టీకల్ దిశ పేపర్‌లో ప్రచురితమైంది. దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించి ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘కేంద్రం వేలం వేస్తామని చెబుతున్న శ్రావణ పల్లి బొగ్గు బ్లాకే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దొడ్డి దారిలో తమ అనుయాయులు.. ప్రతిమ, అరబిందోలకు కట్టబెట్టిన కొయ్యలగూడెం బ్లాక్ -3, సత్తుపల్లి బ్లాక్ - 3, గనులను సైతం తిరిగి సింగరేణికే కేటాయించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరిన ప్రజా ప్రభుత్వం’ అని వెల్లడించింది.
కాగా, నిన్న ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే చర్చలపై సమగ్రంగా దిశ తెలుగు పత్రిక శుక్రవారం మెయిన్ ఎడిషన్‌లో పూర్తి కథనం అందుబాటులో ఉంది.