స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయి.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

ఎంఐఎం పార్టీతో పొత్తుపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టత ఇచ్చారు.

Update: 2024-10-11 09:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం పార్టీతో పొత్తుపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం(MIM)తో కాంగ్రెస్‌కు ఎలాంటి పొత్తు లేదని కుండబద్దలు కొట్టారు. కేవలం స్నేహపూర్వక సంబంధం మాత్రం ఉందని స్పష్టం చేశారు. అక్టోబర్ 15వ తేదీన రెండు జిల్లాలు, 16వ తేదీన రెండు జిల్లాల్లో పర్యటిస్తానని అన్నారు. పూర్తి పర్యటన తర్వాతే పీసీసీ కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

హైడ్రాపై అనవసరంగా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా టార్గెట్ పేదలు కాదని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన బడాబాబులే హైడ్రా టార్గెట్ అని అన్నారు. అసలు మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కేసీఆరే అని గుర్తుచేశారు. ఇప్పుడు అనవసరంగా బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన, ప్రజల బాగోగులు చూడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయని కీలక ఆరోపణలు చేశారు.


Similar News