తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు.. తీన్మార్ మల్లన్న రియాక్షన్ ఇదే!

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న (MLC Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్‌కు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ (Telangana Congress Disciplinary Committee) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Update: 2025-02-07 03:01 GMT
తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు.. తీన్మార్ మల్లన్న రియాక్షన్ ఇదే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న (MLC Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్‌కు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ (Telangana Congress Disciplinary Committee) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వరంగల్‌ (Warangal) సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపైనా ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీసులు (Show Cause Notices) ఇచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టిన కులగణన (Cast Census) నివేదిక పేపర్లను మల్లన్న దగ్ధం చేశారు. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కులగణన నివేదికను వ్యతిరేకించాలని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు.

అయితే, తనకు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై తాజాగా తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడితే తనకు షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ (Congress)లో ఉన్న లీడర్లు అంతా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారని.. అసలు కులగణనలో వేలు పెట్టిన వారికి ముందు షోకాజ్ నోటీసులు (Show Cause Notices) ఇవ్వాలని కామెంట్ చేశారు. కులగణన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం క్లియర్‌గానే ఉందని.. రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదని ఫైర్ అయ్యారు. సర్కార్ ఇచ్చిన నివేదికను నమ్మే పరిస్థితుల్లో బీసీ (BC)లు లేరని కామెంట్ చేశారు. పార్టీలోని కొంతమంది నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని.. వారిని అణచివేయాలని కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపపణలు చేశారు. రాష్ట్రంలో బీసీ సమాజంతో మాట్లాడి తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఈనెల 12లోగా ఆలోచిస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు.  

Tags:    

Similar News