T Congress: బీఆర్ఎస్ కాలకేయుల ప్రచారానికి ఇది చెంపపెట్టు.. టీ కాంగ్రెస్ ట్వీట్
రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ స్పందించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంపై టీ కాంగ్రెస్ (Telangana Congress) స్పందించింది. 2023-2024 ప్రథమార్థం (బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయం)తో పోలిస్తే 2024-2025 మొదటి ఆరు నెలల్లో (కాంగ్రెస్ పాలనలో) ఇళ్ల ధరలు 37 శాతం పెరిగాయని అన్ రాక్ విశ్లేషించించిందని పేర్కొంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని బీఆర్ఎస్ కాలకేయులు చేస్తున్న ప్రచారానికి అన్ రాక్ నివేదిక చెంపపెట్టు లాంటిదని విమర్శించింది. రాజకీయ ఈర్ష్యతో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం బీఆర్ఎస్ (BRS) దుర్నీతికి నిదర్శనం అని ఫైర్ అయింది. శనివారం ఎక్స్ వేదికగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం (Hyderabad Real Estate)పై వివిధ సంస్థలకు నివేదికలకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్ లను పోస్టు చేసింది. గడచిన ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్ బలమైన వృద్ధిని కనబరిచిందని అన్ రాక్ (AnaRock Report) సంస్థ ప్రకటించిందని ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.