సీఎం కేసీఆర్‌కు PCC చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని అరెస్టులు చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-04-01 05:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారిని అరెస్టులు చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్‌లను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలోని వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.

జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ లాంటి ప్రజా నాయకులను నిర్బంధిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఆ ప్రాంతంలో కాలుష్యం అవుతుందన్నారు. ప్రజలు, రైతులు ఇథనాల్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్‌లను వెంటనే విడుదల చేసి పోరాటంలో భాగస్వాములను చేయాలన్నారు. రైతులు, ప్రజలు కోరుకున్న విధంగా విధానాలను అమలు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని రేవంత్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి: నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. కేటీఆర్‌కు దమ్ముంటే నాకు నోటీసులు పంపాలి: RSP (వీడియో) 

ఢిల్లీలో కాంగ్రెస్​‘సెగ’.. 20 వేల మందితో నిరసనలు

Tags:    

Similar News