కేంద్ర నిర్ణయంతో కన్‌ఫ్యూజన్‌లో టీ కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికకు బ్రేక్..?

దాదాపు 27 ఏళ్ల తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు మోక్షం

Update: 2023-09-19 03:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు 27 ఏళ్ల తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు మోక్షం కలిగింది. లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించే బిల్లుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉండటంతో బిల్లు వెంటనే ఆమోదం పొందనుంది. ఇక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేందుకు ఇతర పార్టీల మద్దతును బీజేపీ తీసుకునే అవకాశముంది.

అయితే ఈ బిల్లు ఆమోదం పొందితే రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీలన్నీ మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో బలమైన మహిళా అభ్యర్థులను వెతుక్కోవాల్సి ఉంటుంది. దీంతో పార్టీలకు ఇది ఇబ్బందిగా మారనుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌తో పాటు టీ కాంగ్రెస్‌కు కూడా మహిళా అభ్యర్థుల ఎంపిక కాస్త సమస్యగా మారనుంది. టీ కాంగ్రెస్ ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి స్క్రూటీని ప్రక్రియను కూడా చేపట్టింది. అనంతరం ఢిల్లీ అధిష్టానానికి సీల్డ్ కవర్‌లో పేర్లను కూడా పంపించింది.తెలంగాణలో దాదాపు 25 సీట్లలో అభ్యర్థులు ఖాయమవ్వగా.. మిగతా సీట్లలో కూడా అభ్యర్థులు ఎవరిని కన్ఫామ్ చేయాలనే దానిపై కాంగ్రెస్ హైకమండ్  కసరత్తులు చేస్తోంది. ఈ సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కానుంది.

బిల్లుకు ఉభయ సభల్లో గ్రీన్ సిగ్నల్ లభిస్తే మహిళా అభ్యర్ఠులకు టికెట్లు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది కనుక టీ కాంగ్రెస్ ప్లాన్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం నిర్ణయంలో టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు కాస్త బ్రేక్ పడినట్లు చెప్పవచ్చు. తెలంగాణ ఎన్నికల కోసం ఇప్పటికే బీఆర్ఎస్ 115 అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో ఏడుగురు మహిళలకు మాత్రమే సీట్లు కేటాయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చి కొన్ని స్థానాల్లో మహిళలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్‌కు షాక్ తగిలిందని చెప్పవచ్చు.

Read More..

కేంద్రం కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ ఫస్ట్‌ లిస్ట్‌‌లో ఇక మార్పులు మస్ట్!  

గ్యారంటీలపై KTR ట్వీట్.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!  

Tags:    

Similar News