కొలువులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! నిరుద్యోగ కలలు నేడు నిజమవుతున్నాయి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజాగా ఆయన ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమింపబడిన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కుటుంబానికే కొలువులు ఇచ్చుకునే పాలన పోయి.. తెలంగాణనే కుటుంబంగా భావించి కొలువులు ఇచ్చే ప్రజా పాలన వచ్చింది. ఈ మార్పు అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరుస్తుంది. ఉద్యమకారులకు తృప్తినిస్తుంది. తెలంగాణకు ఆశయాలను సాధిస్తోన్న సంతృప్తినిస్తుంది. నిన్న పోలీసు కొలువులైనా.. నేడు గురుకుల కొలువులైనా.. ఒక నాడు తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు.. నేడు నిజమవుతున్నాయి’ అని పేర్కొన్నారు.